రౌడీ షీటర్ హల్ చల్.. యువకుడిపై కత్తితో దాడి

by  |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రోజురోజుకు క్రైమ్స్ పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం మహబూబియా ఫంక్షన్ హాల్ వద్ద ఓ రౌడీ షీటర్ హల్ చల్ చేశాడు. ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. వివరాల ప్రకారం.. పలు కేసుల్లో నిందితుడిగా ఉండి రౌడీ షీటర్‌గా పేరొందిన జంగల్ ఇబ్బు.. అతడి స్నేహితుడితో కలిసి బాబాన్ సాహబ్ పహడ్ ప్రాంతంలోని మహబూబియా పంక్షన్ హల్ వద్ద నాగారాం గ్రామానికి చెందిన అబ్బాస్‌పై కత్తితో దాడి చేశారు.

ఈ దాడిలో అబ్బాస్‌‌ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రాంతం 5, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండటంతో కేసు నమోదు ఆలస్యంగా జరిగినట్టు సమాచారం. ఇప్పటికే నిందితుడు ఇబ్బుపై పీడీ యాక్టులో కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, గత వారం నిజాం కాలనీలో ఓ యువకుడిని తమ ఇంటిముందు గంజాయి విక్రయించవద్దు అన్నందుకు గంజాయి ముఠా కత్తితో పొడిచి అతడిని గాయపరిచిన విషయం తెలిసిందే.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story