విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య : గవర్నర్ బీబీ హరిచందన్

by srinivas |   ( Updated:2021-12-04 01:29:33.0  )
విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య : గవర్నర్ బీబీ హరిచందన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ఫ్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు గవర్నర్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.



Next Story