- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రొమాంటిక్‌ను నిద్రలేపిన పూరీ.. త్వరలోనే ఇంకో సినిమాకు రెఢీ
<p>దిశ, సినిమా : టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన పూరి.. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘మెహబూబా’ వంటి టీనేజ్ లవ్‌స్టోరీతో తనను లాంచ్ చేసినప్పటికీ ఫలితం నిరాశపర్చింది. ఆ తర్వాత పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో ‘రొమాంటిక్’ అనే మూవీని అనౌన్స్ చేశారు. స్వయంగా పూరి స్క్రిప్ట్ అందించిన సినిమా హాట్ ప్రోమోలతో అట్రాక్ట్ చేసినా, కొంతకాలంగా ఎటువంటి అప్‌డేట్ లేదు. ఒక దశలో […]</p>

దిశ, సినిమా : టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన పూరి.. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘మెహబూబా’ వంటి టీనేజ్ లవ్‌స్టోరీతో తనను లాంచ్ చేసినప్పటికీ ఫలితం నిరాశపర్చింది. ఆ తర్వాత పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో ‘రొమాంటిక్’ అనే మూవీని అనౌన్స్ చేశారు. స్వయంగా పూరి స్క్రిప్ట్ అందించిన సినిమా హాట్ ప్రోమోలతో అట్రాక్ట్ చేసినా, కొంతకాలంగా ఎటువంటి అప్‌డేట్ లేదు. ఒక దశలో సినిమా మధ్యలోనే ఆగిపోయిందని, రిలీజ్ కష్టమేనన్న వార్తలు కూడా వినిపించాయి. దాదాపు ఏడాది తర్వాత తాజాగా వార్తల్లో నిలిచింది ‘రొమాంటిక్’. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా ఫస్ట్ కాపీతో రిలీజ్‌కు సిద్ధంగా ఉందని సమాచారం.
థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ చిత్రంలో పూరి ఆకాశ్ సరసన కొత్త అమ్మాయి కేతిక శర్మ నటించింది. పోస్టర్లు, ప్రోమోల్లోనూ హాట్‌గా కనిపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. కాగా హీరో హీరోయిన్ల మధ్య హాట్ రొమాన్స్.. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది.






