భర్తకు వజ్రాల పిచ్చి.. భార్యకు బెడ్‌రూం పిచ్చి.. అతడు బయటకు వెళ్లగానే..

by  |
Romance
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో అన్నీ ఉన్నా.. కొందరు మహిళలు అక్రమ దారులు తొక్కుతున్నారు. కేవలం పడక సుఖమే ధ్యేయంగా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నారు. ఆస్తి, సమాజంలో స్టేటస్, అన్నీ సమకూర్చే భర్త ఉన్నా.. క్షణికానందం కోసం అర్రులు చాస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. భర్త వజ్రాల వ్యాపారం చేస్తుండగా.. భార్య పేపర్ బోయ్‌తో రాసలీలలు సాగిస్తూ ఎంజాయ్ చేసింది. తన ఇళ్లే కేంద్రంగా రోజుల తరబడి రోమాన్స్ చేసింది. అక్రమ సంబంధం కదా.. ఎన్ని రోజులు దాగుతుంది..? ఓ రోజు భర్తకే నగ్నంగా దొరికి పోయింది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన కామినికి ఐదేళ్ల క్రితం సోహన్‌తో వివాహమైంది. సోహన్ వజ్రాల వ్యాపారి. బిజినెస్ పనిపై తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. అయితే ఆస్తులు ఉన్నా తమకు పిల్లలు లేరన్న బెంగ భార్య కామినిని వెంటాడేది. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. పెళ్లై ఐదేళ్లయిన పిల్లలు కలగడం లేదని, ఎప్పుడూ వ్యాపారమేనా.. తనతో ఏకాంతంగా గడపాలని భార్య గొడవకు దిగేది. అయినా భర్త పట్టించుకోకపోవడంతో భార్య పక్కదారి పట్టింది.

తన భర్త నిర్వాకంతోనే పిల్లలు కలగడం లేదని భావించిన కామిని.. నిత్యం ఇంటికి వచ్చి పేపర్ వేసే యువకుడికి వలపుల వల విసిరింది. అతడికి విలువైన కానుకలు ఇచ్చి మచ్చిక చేసుకుంది. అలా పేపర్ బోయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త టూర్‌కు వెళ్లగానే అతడికి ఫోన్ చేసి రప్పించుకుని బెడ్ రూంలో దూరేది. అలా భర్త ఎన్నిరోజులు టూర్లో ఉంటే అన్ని రోజులు ఆ యువకుడితో ఇంట్లోనే కాపురం పెట్టేది.

అయితే తాను ఎప్పుడు టూర్‌కు వెళ్లిన గొడవ చేసే భార్య.. అసలు అతడిని పట్టించుకోకుండా ఉండటంతో భర్తకు అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తనా అనుమానస్పదంగా ఉండటంతో భార్యపై నిఘా వేశాడు. కొద్దిరోజుల పాటు ఇంట్లోనే ఉండి ఆమెకు, పేపర్ బోయ్ మధ్య సాగుతున్న రాసలీలల విషయాన్ని గుర్తించాడు. అయితే నేరుగా భార్యను ప్రశ్నించకుండా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా తాను ఊరు వెళ్తున్నానని, సాయంత్రం వరకు రానని చెప్పి వెళ్లిపోయాడు.

అయితే అప్పటికే ప్రియుడితో రోజుల తరబడి ఎడబాటుగా ఉన్న కామిని భర్త బయటకు వెళ్లగానే పేపర్ బోయ్‌కి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి రాసలీలల్లో మునిగిపోయారు. ఇదంతా ఇంటి సమీపంలోనే ఉండి గమనిస్తున్న భర్త.. నేరుగా ఇంటి ఆవరణలోకి వెళ్లి బెడ్ రూంలోకి చూశాడు. అక్కడ ఆయన భార్య కామిని.. పేపర్ బోయ్ పూర్తి నగ్నంగా శృంగారంలో మునిగి తేలుతున్న దృశ్యాలను చూసి ఖంగుతిన్నాడు. వెంటనే ఇంటి బయట నుంచి గడియ పెట్టి బంధువులు, ఇంటి చుట్టుపక్కల వాళ్లను పిలిచి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Next Story

Most Viewed