ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఓపెనర్లు ఔట్

93

దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీ 20 పురుషుల వరల్డ్ కప్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తొలుత ఓపెనింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ ఆఫ్రిదీ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరూత్సాహంలో పడ్డారు. ఇక మూడో ఓవర్ వేసిన ఆఫ్రిదీ 3 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్‌ను అవలీలగా తీసుకున్నాడు. దీంతో 6 పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ-సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..