ధోని, కోహ్లీ రూట్‌లోనే రోహిత్ శర్మ.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు (వీడియో)

by  |
Rohit Sharma, Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాకు కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి సిరీస్‌ను ఘనంగా ముగించాడు. న్యూజిలాండ్‌లో 3 టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తొలి సిరీస్‌లోనే తన మార్క్ చూపించాడు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కెప్టెన్సీతో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు.

దీంతో భారత్‌.. కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి చిత్తుగా ఓడించింది. అయితే, రోహిత్‌ మూడో టీ20లో విజయం సాధించాక ట్రోఫీ అందుకున్న అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌కు అందజేశాడు. ఇది వరకు మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ కూడా ఏదైనా ట్రోఫీ గెలిస్తే యువ ఆటగాళ్ల చేతులకు ఇవ్వడం మనకు తెలిసిందే. దీంతో ఆ సాంప్రదాయాన్ని హిట్‌మ్యాన్‌ కూడా కొనసాగించి అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు.


Next Story

Most Viewed