టీమిండియా యంగ్‌ బౌలర్‌ను కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ(వీడియో)

by  |
టీమిండియా యంగ్‌ బౌలర్‌ను కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా టీ20 సిరీస్‌ కొత్త కెప్టెన్ రోహిత్‌ శర్మ యంగ్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తలపై కొట్టాడు. ఏంటీ.. ఎందుకు కొట్టాడో అని కంగారు పడకండి.. సరదాగా ఓ మొట్టికాయ వేశాడు అంతే. బుధవారం రాత్రి జైపూర్‌ వేదికగా టీమిండియా జట్టు న్యూజీలాండ్‌తో తలపడుతోంది. ఇదే సమయంలో వికెట్ కోల్పోయిన రోహిత్ శర్మ డగౌట్‌‌లో రాహుల్ ద్రవిడ్, కేఎల్ రాహుల్‌, మహ్మద్ సిరాజ్ వెనకాలే కూర్చున్నాడు. ఇక మైదానం వైపు చూడాల్సిన సిరాజ్‌ స్టేడియంలో ఓ వృద్ధ దంపతుల సంభాషణను వీక్షిస్తుండగా.. అది గమనించిన రోహిత్.. ఏం చూస్తున్నావ్ అంటూ సరదాగా ఓ మొట్టికాయ వేశాడు. వెంటనే రియాక్ట్ అయిన సిరాజ్ చిరునవ్వు నవ్వాడు. మ్యాచ్‌ చూడు అంటూ రోహిత్ సూచించడం.. వెంటనే ఓకే భయ్యా అంటూ సిరాజ్ రియాక్ట్ అయిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయిని చూసి ఉంటాడు అందుకే కెప్టెన్ తప్పు అంటూ మొట్టికాయ వేశాడని కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed