మ్యాడీతో కింగ్ ఖాన్ ఇంటర్వ్యూ.. ఎగ్జైట్‌‌మెంట్‌లో ఫ్యాన్స్!

by  |
మ్యాడీతో కింగ్ ఖాన్ ఇంటర్వ్యూ.. ఎగ్జైట్‌‌మెంట్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: ఎవర్ గ్రీన్ హీరో మాధవన్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రి : ద నంబి ఎఫెక్ట్’. ఇండియన్ బయోగ్రాఫికల్ డ్రామాగా వస్తున్న సినిమా.. మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో జర్నలిస్టుగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందనేది సమాచారం కాగా.. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం షారుఖ్ ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని.. ఇందులోనూ షారుఖ్ కనిపిస్తాడని సమాచారం. ట్రైలర్‌లో ఎస్ఆర్‌కే మ్యాడీని ఇంటర్వ్యూ చేస్తాడని.. ఇప్పటికే ట్రైలర్ వర్క్ కూడా పూర్తయిందని బీటౌన్ టాక్. ఈ వార్తతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రంలో మాధవన్, నంబి నారాయణన్ క్యారెక్టర్‌లో కనిపించబోతుండగా.. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్న సినిమాలో సిమ్రన్ కీలకపాత్ర చేస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story