కొవిడ్ టెస్టులు చేసే రోబో

by  |
కొవిడ్ టెస్టులు చేసే రోబో
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 వైరస్ ఈ ఏడాది ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పటికీ టెస్టులు చేసే కొద్ది కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో కరోనా వారియర్స్‌కు ఉపయోగపడేందుకు కొన్ని కొత్త ఇన్నోవేషన్‌లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే మెడికల్ వర్కర్లు కరోనా బారిన పడటాన్ని తగ్గించేందుకు రోబోల సాయాన్ని తీసుకోవాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. ఆ దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీలు, ఔత్సాహిక ఇంజినీర్లు కూడా ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈజిప్ట్‌కు చెందిన మహ్మూద్ ఎల్-కోమీ అనే 26 ఏళ్ల ఇంజినీర్.. ఒక రిమోట్ కంట్రోల్డ్ రోబోను కనిపెట్టాడు. సిరా-03 అని పిలిచే ఈ రోబో వైద్యసిబ్బందికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తుంది.

హాస్పిటల్‌లో అందరినీ మాస్కులు పెట్టుకోవాలని చెబుతుంది. పేషెంట్ల ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. అలాగే కొవిడ్ 19 టెస్ట్ కూడా చేస్తుంది. మనిషి లాంటి ముఖంతో, రెండు రోబోటిక్ చేతులతో ఉన్న ఈ రోబో.. రక్తపరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు కూడా తీసి దాని ఛాతి భాగంలో ఉన్న స్క్రీన్ మీద పరీక్షల ఫలితాలను కూడా చూపిస్తుంది.


Next Story

Most Viewed