రోర్ ఆఫ్ RRR’.. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒరిజినల్ సౌండ్ ట్రాక్(OST)

by  |
రోర్ ఆఫ్ RRR’.. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒరిజినల్ సౌండ్ ట్రాక్(OST)
X

దిశ, సినిమా : ‘రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్)’ చిత్రం కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్‌ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ దాదాపు పూర్తికావడంతో రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ స్పీడ్ పెంచింది. ఈ మేరకు ‘రోర్ ఆఫ్ RRR’ పేరుతో ఇటీవలే విడుదల చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. ఇదే క్రమంలో తాజాగా ‘రోర్ ఆఫ్ RRR’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్(OST)ని ఇండియాలోని పాపులర్ మ్యూజిక్ ఫ్లాట్‌ఫ్లామ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. కీరవాణి కంపోజ్ చేసిన ట్యూన్‌కు ఆదిత్య అయ్యంగార్‌తో కలిసి లిరిక్స్ అందించిన పాపులర్ ర్యాపర్ బ్లేజ్.. ఈ ర్యాప్ సాంగ్ ఆలపించాడు. కాగా మ్యూజిక్ డైరెక్టర్స్ అచ్చు రమణి – జీవన్ బాబు ఈ పాటకు ప్రోగ్రామింగ్ చేశారు.

ఇదిలా ఉంటే, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ్, కన్నడ, హిందీలోని ఐదుగురు పాపులర్ సింగర్స్‌ ఈ పాటను పాడటం విశేషం. తెలుగు వెర్షన్‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ హేమచంద్ర ఆలపించారు. ఇతర భాషల్లో అనిరుధ్ రవిచంద్రన్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, యాసిన్ నిజార్ పాడారు. ప్రమోషన్స్‌లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. అన్నీ భాషల్లో ఒకే విధమైన ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవుతారని తెలుస్తోంది.

Next Story