విషాదం నింపిన ప్రయాణం.. అంత్యక్రియలకు వెళుతూ అనంతలోకాలకు..

167

దిశ, జనగామ:  రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెంది‌న సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. జనగామ, సూర్యాపేట జాతీయ రహదారిపై వనపర్తి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌లోని శేర్ లింగం పల్లి‌కి చెందిన శేఖర్ రెడ్డి, భార్య ధనలక్ష్మి, కుమారుడు రఘావ రెడ్డి‌తో కలిసి తిరుమలగిరిలో వాళ్ల బావ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళుతున్నారు. ఈ క్రమంలో వనపర్తి సమీపంలో కారు టైర్ పేలిపోయి కారు అదుపు తప్పి తుమ్మల గూడెం నుంచి జనగామ వస్తున్న బర్రెల లోడుతో ఉన్న టాటా ఏసీని ఢీ కొంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.