- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంతోషంగా కారులో ఫంక్షన్‌కు బయలుదేరిన మిత్రులు.. చివరకు
<p>దిశ,చౌటుప్పల్:యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరిన కారు జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద శుక్రవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే వీరు ఖమ్మంలోని ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు వెళ్తుండగా లక్కారం వద్దకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకునికి గాయాలు కాగా […]</p>

X
దిశ,చౌటుప్పల్:యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరిన కారు జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద శుక్రవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే వీరు ఖమ్మంలోని ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు వెళ్తుండగా లక్కారం వద్దకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకునికి గాయాలు కాగా మరో యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులను తన స్నేహితులు చికిత్సకోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. జరిగిన సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు.
Next Story






