మల్లన్న దర్శనం కోసం వెళ్తూ అనంతలోకాలకు

by Batti.Sumithra |   (  Updated:2021-08-05 23:16:36  IST  )

<p>దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన సురేష్ వృత్తిరీత్యా చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సురేష్ భార్య భువనేశ్వరితో కలిసి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కారులో బయలు దేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో కారుకు కుక్క అడ్డు రాగ, దానిని తప్పించబోయి డ్రైవర్ [&hellip;]</p>

మల్లన్న దర్శనం కోసం వెళ్తూ అనంతలోకాలకు
X

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన సురేష్ వృత్తిరీత్యా చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సురేష్ భార్య భువనేశ్వరితో కలిసి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కారులో బయలు దేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో కారుకు కుక్క అడ్డు రాగ, దానిని తప్పించబోయి డ్రైవర్ కారు‌ను చెట్టుకు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సురేష్ భార్య భువనేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని స్థానికులు గమనించి గాయాలైన సురేష్‌ను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story