- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిప్పర్ ఢీకొని పంచాయతీ కార్యదర్శి దుర్మరణం
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పోలిస్ స్టేషన్ ఎదురుగా మంగళవారం జరిగింది. నిజామాబాద్ నగరంకు చెందిన ఉమాకాంత్ (50) మల్లారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులలో భాగంగా తన స్కూటీపై నిజామాబాద్ వస్తుండగా పోలిస్ స్టేషన్ ఎదుట అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఉమాకాంత్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పోలిస్ స్టేషన్ ఎదురుగా మంగళవారం జరిగింది. నిజామాబాద్ నగరంకు చెందిన ఉమాకాంత్ (50) మల్లారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులలో భాగంగా తన స్కూటీపై నిజామాబాద్ వస్తుండగా పోలిస్ స్టేషన్ ఎదుట అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఉమాకాంత్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ ని సీజ్ చేసి, పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






