రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం

by Shyam |

<p>దిశ మెదక్: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. చేకూరి అంజయ్య(58), మైసమ్మ(50) దంపతులది శివ్వంపేట మండలం దంతానపల్లి గ్రామం. కాగా వీరు ఇంట్లో సామాగ్రి కొనుగోలు కోసం బైక్ పై తుప్రాన్ కు బయల్దేరారు. నాగులపల్లి చౌరస్తా వద్ద వెనకనుంచి నిజామాబాద్ -2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో భర్త అంజయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మైసమ్మను తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా [&hellip;]</p>

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
X

దిశ మెదక్: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. చేకూరి అంజయ్య(58), మైసమ్మ(50) దంపతులది శివ్వంపేట మండలం దంతానపల్లి గ్రామం. కాగా వీరు ఇంట్లో సామాగ్రి కొనుగోలు కోసం బైక్ పై తుప్రాన్ కు బయల్దేరారు. నాగులపల్లి చౌరస్తా వద్ద వెనకనుంచి నిజామాబాద్ -2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో భర్త అంజయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మైసమ్మను తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story