- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో ఘోరం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు
by Batti.Sumithra |
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కాలనీ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు పాదాచారులపైకి దూసుకెళ్లింది. అంతేగాకండా.. ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు […]</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కాలనీ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు పాదాచారులపైకి దూసుకెళ్లింది. అంతేగాకండా.. ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి కామారెడ్డి పట్టణంలోని ఆర్బినగర్‌కు చెందిన మైనర్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరు భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన లింగంగా గుర్తించారు. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






