కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

8

దిశ, వెబ్‎డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ ఎదురుగా జాతీయ రహదారిపై కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఆళ్లగడ్డకు చెందినవారిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.