- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
<p>దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మల్లాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. మల్లాపూర్‌కు చెందిన గుడికందుల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి తన బావమరిది చంద్రమోహన్ దుబాయ్ వెళ్తున్నాడని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు జగిత్యాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెంకటాపూర్ […]</p>

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మల్లాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు.
మల్లాపూర్‌కు చెందిన గుడికందుల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి తన బావమరిది చంద్రమోహన్ దుబాయ్ వెళ్తున్నాడని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు జగిత్యాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెంకటాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లత, రమాదేవి, శృతి, చరణ్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన చంద్రమోహన్ కు విషయం తెలియడంతో వెనక్కి తిరిగి వచ్చిన ఆయన మృతదేహాలను చూసి బోరున విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






