గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

101

దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు తెల్లవారుజూమున నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతి వేగంగా వస్తున్న మారుతి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..