- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో యాక్సిడెంట్.. నవ వరుడు మృతి, కోమాలో వధువు
<p>దిశ, శేరిలింగంపల్లి: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపతులకు ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కలకాలం తోడుంటాడనుకున్న నవ వరుడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించగా.. పారాని ఆరకముందే ఆ వధువు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన పార్శి అన్నపూర్ణ, పార్శి మురళీకృష్ణ కుమారుడు శ్రీనివాస్ వివాహం ఈనెల 21న కనిమొళితో తిరుపతిలోని కోలయిగుట్టలో జరిగింది. వివాహం అనంతరం […]</p>

దిశ, శేరిలింగంపల్లి: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపతులకు ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కలకాలం తోడుంటాడనుకున్న నవ వరుడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించగా.. పారాని ఆరకముందే ఆ వధువు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన పార్శి అన్నపూర్ణ, పార్శి మురళీకృష్ణ కుమారుడు శ్రీనివాస్ వివాహం ఈనెల 21న కనిమొళితో తిరుపతిలోని కోలయిగుట్టలో జరిగింది. వివాహం అనంతరం అత్తవారింటికి వెళ్తోన్న సమయంలో బెంగళూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ వధూవరులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ వరుడు శ్రీనివాస్ మృతిచెందాడు. వధువు కనిమొళి కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్ కారు వాహనం నడిపినట్లు సమాచారం. నూతన వధూవరులు ప్రమాదానికి గురవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






