- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. మున్సిపల్ సిబ్బందికి తీవ్ర గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ, కొల్చారం : కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని అండమాన్ బండ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మెదక్ మున్సిపల్ సిబ్బంది విజయ్ కుమార్, మున్నా.. బైక్‌పై మెదక్ నుంచి ఏడుపాయల వెళ్తుండగా మార్గమధ్యంలో నర్సాపూర్ నుండి మెదక్ వైపు వెళ్తున్న పెళ్లి కారు.. వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కొల్చారం పోలీస్ సిబ్బంది 108 అంబులెన్స్ సహాయంతో […]</p>

X
దిశ, కొల్చారం : కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని అండమాన్ బండ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మెదక్ మున్సిపల్ సిబ్బంది విజయ్ కుమార్, మున్నా.. బైక్‌పై మెదక్ నుంచి ఏడుపాయల వెళ్తుండగా మార్గమధ్యంలో నర్సాపూర్ నుండి మెదక్ వైపు వెళ్తున్న పెళ్లి కారు.. వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కొల్చారం పోలీస్ సిబ్బంది 108 అంబులెన్స్ సహాయంతో మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Tags
- medak district
Next Story






