లారీని ఢీ కొన్న తుఫాన్ వాహనం

43

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గజపతినగరం మండలం మరుపల్లిలో ఆదివారం ఉదయం తుఫాన్ వాహనం లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.