- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురిని మింగిన లారీ
<p>దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట వద్ద 161 జాతీయ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటోను అల్మాయిపేట శివారు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పదేళ్లలోపు ఇద్దరూ చిన్నారులు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్థానికుల సమాచారంలో ఘటన స్థలికి వచ్చిన 108 సిబ్బంది క్షతగాత్రులను […]</p>

X
దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట వద్ద 161 జాతీయ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటోను అల్మాయిపేట శివారు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పదేళ్లలోపు ఇద్దరూ చిన్నారులు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్థానికుల సమాచారంలో ఘటన స్థలికి వచ్చిన 108 సిబ్బంది క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






