అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో ఘోర ప్రమాదం.. సీఐ దంప‌తులు దుర్మర‌ణం

318

హైదరాబాద్:  హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌.లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సీఐ భార్య కారు నడిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..