రోడ్డు ప్రమాదం..10tv రిపోర్టర్ మృతి

by Shyam |   (  Updated:2020-03-04 01:29:05  IST  )

<p>దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం శంషాబాద్ వైపు వెళ్తున్నఓ బైక్‌ను వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం అతివేగంగా వెళ్తూ ఢీకొట్టింది.ఈ ఘటనలో 10టీవీ రిపోర్టర్ కాసిం, అతని పెద్ద కూతురు బైక్ పై నుంచి కింద పడిపోయారు. అనంతరం వెనుకే వచ్చిన బొలెరో వాహనం కాసిం తల మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కూతురు గాయాలతో బయటపడగా ఆమెను [&hellip;]</p>

రోడ్డు ప్రమాదం..10tv రిపోర్టర్ మృతి
X

దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం శంషాబాద్ వైపు వెళ్తున్నఓ బైక్‌ను వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం అతివేగంగా వెళ్తూ ఢీకొట్టింది.ఈ ఘటనలో 10టీవీ రిపోర్టర్ కాసిం, అతని పెద్ద కూతురు బైక్ పై నుంచి కింద పడిపోయారు. అనంతరం వెనుకే వచ్చిన బొలెరో వాహనం కాసిం తల మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కూతురు గాయాలతో బయటపడగా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story