- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగగా మారిన ఆర్ఎంపీ డాక్టర్..
<p>దిశ, ఎల్బీనగర్ : డాక్టర్‌గా ఎందరికో సేవలు అందించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి రూ. 5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన గుడికాడి నవీన్‌కుమార్ (41) ఆర్ఎంపీ డాక్టర్‌గా లక్ష్మీదేవుని పల్లిలో సేవలందిస్తున్నాడు. […]</p>

దిశ, ఎల్బీనగర్ : డాక్టర్‌గా ఎందరికో సేవలు అందించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి రూ. 5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన గుడికాడి నవీన్‌కుమార్ (41) ఆర్ఎంపీ డాక్టర్‌గా లక్ష్మీదేవుని పల్లిలో సేవలందిస్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్‌గా సరైన సంపాదన రాకపోవడంతో దొంగతనాలకు స్కెచ్ వేశాడు. ఆర్టీసీ బస్సులను టార్గెట్ చేసి ఏపీ నుండి హైదరాబాద్ వచ్చే బస్సులలో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
గత నెల 8వ తేదీన నరసరావుపేట నుండి ఎల్బీనగర్ వచ్చిన ఓ ప్రయాణికుడు తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించి ఆటోనగర్ వద్ద బస్సు దిగి వెళ్లిపోయాడని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసుల సహాయంతో మంగళవారం ఉదయం 6 గంటలకు వనస్థలిపురం పనామా క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి రూ. 5 లక్షల విలువైన 16 ల్యాప్‌టాప్‌లను, 5 సెల్‌ఫోన్‌లను, 2 పవర్ బ్యాంక్‌లను, ఒక రిస్ట్‌వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ సీసీఎస్ ఏసీపీ (క్రైం) ఆర్. శేఖర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు టి. మహేశ్, కే. సత్యనారాయణ, డీఐ జీ.జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.






