- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియా కస్టడీ మరోసారి పొడగింపు..
<p>దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తి రిమాండ్‌ను ముంబై సెషన్స్ కోర్టు మరోసారి పొడిగించింది. సుశాంత్ మృతి కేసు విచారణలో అనుహ్యంగా డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అనంతరం రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో నలుగురుని అరెస్ట్ చేసి ముంబై సెషన్స్ కోర్టు ఎదుట హాజరుపరిచింది. అయితే, విచారణ నిమిత్తం కోర్టు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తి రిమాండ్‌ను ముంబై సెషన్స్ కోర్టు మరోసారి పొడిగించింది. సుశాంత్ మృతి కేసు విచారణలో అనుహ్యంగా డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అనంతరం రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో నలుగురుని అరెస్ట్ చేసి ముంబై సెషన్స్ కోర్టు ఎదుట హాజరుపరిచింది. అయితే, విచారణ నిమిత్తం కోర్టు వీరిని అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపించింది.
ఈ రోజుతో రియా కస్టడి ముగుస్తుండగా, తాజాగా ముంబై సెషన్స్ కోర్టు అక్టోబర్ 20వరకు కస్టడిని పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అటు బెయిల్ కోరుతూ రియా ముంబై కోర్టులో గత నెలలో పిటీషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులను బుధవారం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






