మాస్ చాన్స్ కొట్టేసిన రీతువర్మ

26

దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరోయిన్ రీతు వర్మ ‘పెళ్లి చూపులు’ సినిమాతో క్లిక్ అయింది. టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువగా ఉన్నా తమిళ, కన్నడ భాషల్లో మాత్రం సూపర్ చాన్స్‌లు కొట్టేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ‘పుతం పుదుం కాలై’లో బ్యూటిఫుల్‌గా కనిపించిన రీతు అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో నాని ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్న భామ.. టాలీవుడ్ నుంచి మరో అవకాశం అందుకుందని సమాచారం.

రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీలో ఫిమేల్ లీడ్ చేయనుందట రీతు. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా..ఈ చిత్రం హిట్ అయితే, రీతు కెరియర్ టాలీవుడ్‌లోనూ దూసుకుపోయే అవకాశం ఉంది. రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా ఈ చిత్రం పూర్తి కాగానే పట్టాలెక్కే చాన్స్ ఉంది.