లవ్ అండ్ రొమాన్స్.. ప్రాక్టికల్‌గా మారిపోతున్న రీతూ వర్మ

by  |
ritu
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రీతూ వర్మ లవ్ అండ్ రొమాన్స్ గురించి ఓపెన్ అయింది. పెరుగుతున్న కొద్దీ ప్రాక్టికల్‌గా మారిపోతామన్న రీతు.. రొమాన్స్ విషయంలో గ్రాండ్ గెశ్చర్స్ కావాలనుకుంటానని తెలిపింది. లిటిల్ థింగ్స్ తనను మోస్ట్ హ్యాపీగా ఉంచుతాయన్న భామ.. ‘ఫ్లవర్స్, పర్సనల్ నోట్, గుడ్ మీల్ ఏదిచ్చినా హ్యాపీనే కానీ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్’ అని తెలిపింది. ఇది లైఫ్‌లో తానున్న ఫేజ్‌తో కూడా ముడిపడి ఉందన్న ఆమె.. తనను హ్యాపీగా ఉంచేందుకు మరో మనిషి అవసరం తప్పనిసరేమీ కాదని చెప్పింది.

తను మెటీలియలైజ్‌డ్ , ఇండిపెండెంట్ పర్సన్ అని తెలిపిన రీతు.. ఒక వస్తువు కొనాలనుకుంటే కొనేస్తానని, ఈ విషయంలో ప్రత్యేకంగా ఎవరి తోడు అవసరం లేదని వివరించింది. తాజాగా ‘వరుడు కావలెను’ సినిమాతో హిట్ అందుకున్న రీతు.. టాలీవుడ్‌తో పాటు పలు కోలీవుడ్, మాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది.

Next Story