డైరెక్టర్ మరణవార్తపై రితీష్ సీరియస్

by Vadlamudi Anukaran |

<p>ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ మరణించారన్న ఫేక్ న్యూస్‌పై మండిపడ్డారు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్. గొప్ప సెలెబ్రిటీ గురించి ఇలాంటి వార్త చెప్పేటప్పుడు మీడియా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నారని.. మనతో పాటు బతికే ఉన్నారని తెలిపారు. కాగా, ఆయన చనిపోయారన్న వార్తతో సంతాపం తెలిపిన సెలెబ్రిటీలంతా తప్పు అయిందని.. ఇలాంటి విషయాల్లో మీడియా కన్‌ఫ్యూజ్‌గా ఉండకూడదని కోరారు. ప్రస్తుతం నిషికాంత్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో [&hellip;]</p>

డైరెక్టర్ మరణవార్తపై రితీష్ సీరియస్
X

ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ మరణించారన్న ఫేక్ న్యూస్‌పై మండిపడ్డారు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్. గొప్ప సెలెబ్రిటీ గురించి ఇలాంటి వార్త చెప్పేటప్పుడు మీడియా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నారని.. మనతో పాటు బతికే ఉన్నారని తెలిపారు. కాగా, ఆయన చనిపోయారన్న వార్తతో సంతాపం తెలిపిన సెలెబ్రిటీలంతా తప్పు అయిందని.. ఇలాంటి విషయాల్లో మీడియా కన్‌ఫ్యూజ్‌గా ఉండకూడదని కోరారు.

ప్రస్తుతం నిషికాంత్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాండిస్, ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. జూలై 31న ఆస్పత్రిలో చేరారు. కాగా, గతంలో లివర్ సిరోసిస్‌తో బాధపడిన ఆయనకు ప్రస్తుతం ఆ సమస్య కూడా తోడైందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

Next Story