మంటల్లో గాయపడితే..పబ్లిసిటీ స్టంట్‌లా అనిపించిందా?: కోలీవుడ్ హీరో

by  |
Rishab Shetty
X

దిశ, సినిమా: కన్నడ హీరో రిషబ్ శెట్టి ‘హీరో’ సినిమాషూటింగ్‌లో గాయపడ్డ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్‌లో బేలూర్‌లో షూటింగ్ చేస్తున్న క్రమంలో జూలైలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీజియన్‌లో షూటింగ్ చేసే క్రమంలో పెట్రో బాంబ్ పేలి మంటలు చెలరేగాయి. రిషబ్ శెట్టి వెనుక భాగంలో ఫైర్ అంటుకుని గాయాలు అయ్యాయి. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఊహాగానాలు మొదలు కావడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు హీరో. ఈ ఘటనలో తలకు గాయాలయ్యాయని, వెంట్రుకలు కూడా కాలిపోయాయని తెలిపాడు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో అదృష్టవశాత్తు తీవ్రనష్టం జరగలేదని వివరించారు. ఈ వీడియో కచ్చితంగా పబ్లిసిటీ స్టంట్ మాత్రం కాదన్నారు రిషబ్ శెట్టి. వీడియోపై ఇంత చర్చ జరుగుతుందని తెలిస్తే సినిమా ట్రైలర్ కన్న ముందే ఆ వీడియో రిలీజ్ చేసే వాళ్లమని నవ్వుతూ చెప్పారు. ఈ రోజు(శుక్రవారం) రిలీజ్ అయిన ‘హీరో’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

https://twitter.com/shetty_rishab/status/1366741690241871872?s=20

Next Story

Most Viewed