కటౌట్ చూస్తే కమిట్ అవ్వాల్సిందే!

by  |
కటౌట్ చూస్తే కమిట్ అవ్వాల్సిందే!
X

బాహుబలి ప్రభాస్.. కటౌట్ చూస్తే కమిట్ అవ్వాల్సిందే. ఎందరో బాలీవుడ్ హీరోయిన్స్ ప్రభాస్‌తో సినిమా అంటే క్యూలో నిలబడతారు. కానీ వారందరిని కాదని, ఓ అప్ కమింగ్ హీరోయిన్‌కు ఈ ఛాన్స్ దక్కిందట. ‘లవర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిద్ధి కుమార్ ‘ఓ డియర్ ‘ సినిమాలో యంగ్ రెబల్‌స్టార్‌కు జోడిగా కీలక‌పాత్రలో కనిపించనుందట. దీంతో ఈ భామ గాల్లో తేలిపోతుందట. టాలీవుడ్, కోలీవుడ్‌లో చిన్న సినిమాల్లో చేసిన హీరోయిన్‌కు ఏకంగా ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం గంతులేయడంలో తప్పులేదు.

రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపికైంది. క్యూట్ లవ్ స్టోరీగా వస్తున్న సినిమాలో ఎవరు ఊహించని క్యూటీ వచ్చి చేరిందన్నమాట. మరి ఈ సినిమాతోనైనా రిద్ది కుమార్ దశ మారుతుందేమో చూడాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed