విగ్ ఉపయోగించిన ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’

51

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా లేటెస్ట్ మూవీ ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. రిచా ముఖ్యమంత్రి రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో బేబి హెయిర్ కట్‌తో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి మెప్పించింది. నార్మల్‌గా అయితే ఈ మూవీ కోసం హెయిర్ కట్ చేయించుకోవాల్సి ఉన్నా.. విగ్ ధరించి షూటింగ్ కంప్లీట్ చేశానని తెలిపింది రిచా. డైరెక్టర్ జుట్టు కత్తిరించుకోవాలని చెప్పినా.. తన మాట వినకపోవడం వెనుక చిన్న కథ ఉందంటూ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

దర్శకుడు హెయిర్ కట్ గురించి చెప్పినప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నానని.. తన పాత్రకు సరిపోయే విధంగా ఫన్ ఫ్రీ హెయిర్ కట్ చేసుకునేందుకు డిసైడ్ అయ్యానని తెలిపింది. కానీ ఆ సమయంలోనే యాక్టర్ అలీ ఫజల్‌తో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలిపింది. ఒకవేళ జుట్టు కట్ చేస్తే.. ఏప్రిల్ వరకు హెయిర్ పుట్టగొడుగులా తయారవుతుందనుకుని భయపడిపోయానంది. చిన్నప్పటి నుంచి అలాంటి హెయిర్ అంటే చిరాకు అని చెప్పింది. దీంతో విగ్ ఉపయోగిద్దామని దర్శకుడిని రిక్వెస్ట్ చేశానని.. దయతో అంగీకరించాడని చెప్పింది. ఈ సందర్భంగా ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ కోసం ప్రయత్నించిన విగ్స్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. కాగా సుభాష్ కపూర్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా జనవరి 22న రిలీజ్ కానుంది.