- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైస్ పుల్లింగ్: కాయిన్ల మోజులో జనాలు.. వీధిన పడుతున్న జీవితాలు
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న కలల ప్రపంచంలో తిరుగాడే వారికి టానిక్ లా పనిచేస్తున్న పదాలివి. ఆశల పల్లకిలో తేలియాడే వారికి ఊరిస్తూ.. ఉరికిస్తున్నవి. అప్పుల ఊబిలో కూరుకపోయిన వారు కొందరైతే ఆస్తులను తెగనమ్ముకుని రోడ్డున పడ్డవారెందరో. వాస్తవం దేవుడెరుగు కానీ ఈజీ మని సంపాదించాలన్న ఆలోచనల్లో జీవనం సాగిస్తున్న వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నా వారెందరో. ఇంతకీ అవేంటీ.. ఏం జరుగుతోంది అసలు. అన్న విషయాలపై ’’దిశ‘‘ ప్రత్యేక కథనం.. రైస్ […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న కలల ప్రపంచంలో తిరుగాడే వారికి టానిక్ లా పనిచేస్తున్న పదాలివి. ఆశల పల్లకిలో తేలియాడే వారికి ఊరిస్తూ.. ఉరికిస్తున్నవి. అప్పుల ఊబిలో కూరుకపోయిన వారు కొందరైతే ఆస్తులను తెగనమ్ముకుని రోడ్డున పడ్డవారెందరో. వాస్తవం దేవుడెరుగు కానీ ఈజీ మని సంపాదించాలన్న ఆలోచనల్లో జీవనం సాగిస్తున్న వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నా వారెందరో. ఇంతకీ అవేంటీ.. ఏం జరుగుతోంది అసలు. అన్న విషయాలపై ’’దిశ‘‘ ప్రత్యేక కథనం..
రైస్ పుల్లింగ్..
రైస్ పుల్లింగ్ (ఆర్‌పి) ఈ పదం విన్నప్పుడల్లా లక్షల మంది వేల కోట్ల రూపాయలు తమ అకౌంట్లలో పడిపోతున్నాయన్న ఫీలింగ్ లో కాలం వెళ్లదీస్తూ అన్వేషణ జరుపుతూనే ఉన్నారు. దశాబ్దాలుగా వీటి కోసం తిరిగి ఆర్థిక భారంతో అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నెన్నో. వస్తువులు దూరం నుండి బియ్యాన్ని లాక్కుంటాయని, అవి ఎంత దూరం నుండి లాగితే అన్ని కోట్ల రూపాయలు అంతర్జాతీయ కంపెనీలు చెల్లించుకుంటాయని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆర్‌పి పవర్ ఉన్న వస్తువులను బియ్యం తాకిన తరువాత నలుపు రంగులోకి మారుతాయని, కాపర్ వైరు పెడిత్ బ్లాక్ అవుతుందని, టార్చ్ లైట్ ఆన్ చేస్తే లైట్ డిమ్ అవుతుందని చెప్తుంటారు. ఈ బియ్యాన్ని ల్యాబ్ ల్లో టెస్ట్ చేయించుకున్న తరువాత లావాదేవీలు జరుగుతాయని చెప్తుంటారు.
రైస్ టు రైస్ క్యాచ్..
రైస్ పుల్లింగ్ కాయిన్స్ లాక్కున్న బియ్యం సాధారణ బియ్యాన్ని కూడా లాక్కుంటాయని ఈ బియ్యాన్ని టెస్ట్ కు పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. బియ్యం రైస్ టు రైస్ క్యాచ్ చేసినట్టు రుజువైతే సదరు వస్తువు అమ్మే అవకావశం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.
డూప్లికేట్ రైస్ పుల్లింగ్..
రైస్ పుల్లింగ్ వస్తువుకు దొరకకపోతే దాని స్థానంలో డూప్లికేట్ ఆర్‌పి వస్తువు తయారు చేసి విక్రయించినా కొంటామని చెప్తుంటారు. అంతర్జాతీయంగా వ్యాపారం చేసే కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయని, వారికి టార్గెట్ ఉంటున్నందున డూప్లికేట్ ఆర్‌పి వస్తువు కొని కంపెనీకి సప్లై చేస్తారని కూడా చెప్తుంటారు. డీఆర్‌పి కూడా కోట్లలో ధర పలుకుతుందని చెప్తుంటారు.
తయారవుతోందిలా..
రైస్ పుల్లింగ్ వస్తువులు సహజ సిద్దంగా తయారవుతాయని, పూర్వ కాలంలో వాడిన పంచలోహాలకు సంబంధించిన వస్తువులు భూమిలో కూరుకుపోయి ఉంటాయని, పిడుగు పడినప్పుడు ఈ వస్తువులు ఇరిడియం కాపర్ ను ఆకర్షిస్తాయని చెప్తారు. ఇరిడియం కాపర్ ను ఆకర్షించిన వస్తువులు రేడియేషన్ తో ఉంటాయని స్పెషల్ సూట్లు వేసుకుని లోపలకు వెళ్లి వాటిని పరిక్షించాల్సి ఉంటుందని చెప్తారు. ఈ సూట్లకే రూ. 5 లక్షలు అవుతాయని, టెస్టర్ కు అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సినందుకు రూ. 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్తారు. టెస్టర్ వచ్చి రైస్ పుల్లింగ్ వస్తువు పరీక్షించిన తరువాత అంతర్జాతీయ వ్యాపార సంస్థ ప్రతినిధులు వచ్చి వ్యాపారం చేస్తారని చెప్తారు.
యాంటిక్ పీస్..
పురాతన వస్తువుల కిందకు వచ్చే ఈ వస్తువును కొనుగోలు చేసే ముందు యాంటిక్ పీస్ లైసెన్స్ తీసుకోవల్సి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడున్న నిభందనలు యాంటిక్ పీస్ లైసెన్స్ తీసుకునేందుకు అనుగుణంగా లేవని, 1980వ దశాబ్దంలో కొంతమంది లైసెన్స్ తీసుకున్న వారి పేరిట ఆ వస్తువు క్రయవిక్రయాలు జరుపుతామని చెప్తున్నారు. అయితే ఇందులో వస్తువు ఉన్న వ్యక్తితో పాటు మీడియాగా ఉన్న వారికి కూడా వేల కోట్ల రూపాయలు వస్తాయని కూడా చెప్తారు. దీంతో ఇదో పెద్ద నెట్ వర్క్ లా తయారై పోయింది.
ఆర్‌పి ఐటెం అమ్మకం అయిన తరువాత నేరుగా అకౌంట్లలోకే డబ్బులు వస్తాయని ఇందుకు ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదని, వీటి వ్యాపారంలో భాగస్వాములైన వారంతా 10 ఏళ్ల వరకు అంతర్జాతీయ విమానాల్లో ప్రపంచాన్నే చుట్టేయవచ్చంటూ పుకార్లను వదిలారు. దీంతో ఈ ఒక్క వస్తువు చేతికి చిక్కితే చాలు తర తరాలు బ్రతకవచ్చని కొందరు, మీడియాలో తమ పేరు ఉంటే కోట్ల రూపాయలు చేతుల్లో పడతాయని మరి కొందరు కలలు కంటూ కుటుంబాలను వదిలేసి తిరుగుతూనే ఉన్నారు.
ఎయిర్ బస్సులే స్టార్ట్ కావంట..
ఈ కాయిన్ చేతిలో ఉంటే ఎయిర్ బస్సు నుండి ఎర్ర బస్సు వరకు ప్రతి వాహనం స్టార్ట్ కావని, దీనిని ప్యాకింగ్ చేసే పద్దతే వేరుగా ఉంటుదని చెప్తంటారు. మోటార్లతో నడిచే వాహనాలతో పాటు పవర్ సప్లై చేసే మెయిన్ లైన్ల ప్రాంతానికి ఈ వస్తువులను తీసుకు వెళ్తే దాని పవర్ తగ్గిపోతుందని కూడా చెప్తుంటారు. ఇరిడియం కాపర్ లభ్యం అయ్యే ఈ వస్తువుల కారణంగా చనిపోతామని ఓ వైపున ప్రచారం చేస్తూనే ఈ వస్తువునే నేరుగా పట్టుకుని వెళ్తే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయని, విద్యుత్ వైర్ల మీదుగా వెళితే పవర్ పోతుందని చెప్తుండడం గమనార్హం. వీరు చేస్తున్న ప్రచారంలో ఎంతటి నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోఖ్రాన్ తో ముడిపెట్టి..
పొఖ్రాన్ అణు పరీక్షలు అంతర్జాతీయ సమాజానికి తెలియకుండా ఉండేందుకు అప్పటి సైంటిస్టులు ఇరిడియం కాపర్ ను వినియోగించారని కూడా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల శాటిలైట్ కు చిక్కకుండా భారత్ పోఖ్రాన్ పరీక్షలు చేయడంలో సక్సెస్ అయిందని కూడా చెప్తుంటారు. దీంతో నిజమేనని నమ్మి ఈ మాయా ప్రపంచంలో చక్కర్లు కొట్టే వారు ఎక్కువై పోయారు.
ప్రముఖుల పేర్లు..
ఈ దందాలో జాతీయ స్థాయి నుండి గ్రామ స్థాయి ప్రముఖులు తిరుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు. వారు వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కారణం ఆర్‌పి ట్రాంజక్షన్ అంటూ చెప్తుంటారు. బడా బాబుల గురించి చెప్పడంతో సామన్యులు నిజమేనని నమ్మి ఆర్ పి ఐటెమ్స్ కోసం అన్వేషణ మొదలు పెడుతున్నారు.
మోసపోయిన వారెందరో..
ఇరిడియం కాపర్ ఉన్న ఐటెం తమ వద్ద ఉందని ఫలనా ప్రాంతానికి వచ్చి డబ్బులు చూపిస్తే వ్యాపారం చేస్తామని చెప్పే ముఠాలు కూడా రంగంలోకి దిగాయి, మహారాష్ట్న, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు లాక్కుని చితకబాది పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. చేసేదే తప్పుడు దందా పోలీసులకు చెప్తే ఇంకేమైనా ఉంటుందా అనుకుని మోసానికి గురైన వారు మింగలేక కక్కలేక ఇంటికి చేరుకుంటున్నారు.
ప్యాకింగ్ పేరిట..
కెమికల్ ప్యాకింగ్, నేచరుల్ ప్యాకింగ్ అంటూ మోసం చేసే బ్యాచులు కూడా తిరుగుతున్నాయి. తమకు తెలిసిన వారి వద్ద ఆర్‌పి ఐటెం ఉందని, దానిని కెమికల్ ప్యాకింగ్ చేశామని, టెస్టర్ వస్తే ఓపెన్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. 30 నుండి 40 లక్షల వరకు అవసరం పడతాయంటూ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు కూడా లేకపోలేదు. వ్యాపారం జరిగితే అందులో మీకు వాటా ఉంటుందని కూడా నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన ముఠాలు అన్నీఇన్నీ కావు.
మెట్రో సిటీల నుండి విలేజ్ వరకు..
ఆర్‌పి ఐటెం లావాదేవీల్లో తిరుగుతున్న వారు మెట్రో నగరాల నుండి కుగ్రామానికి చెందిన వారు కూడా ఉన్నారంటే ఈ దందాపై ఎంతటి ప్రచారం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. సిటీల్లో అయితే స్టార్ హోటల్లే కేంద్రంగా ఆర్‌పి డీల్స్ సాగుతుంటాయని ప్రచారంలో ఉంది. అంతేకాకుండా కర్నాటకలోని బెంగుళూరు కేంద్రంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ టీం ఆర్‌పి ఉందని ఇదుకు రూ. 5 నుండి 10 లక్షలు అవసరం అవుతాయని చెప్పి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. డీల్ సెట్ అవుతోందంటూ డబ్బులు ఇచ్చిన వారికి కాలయాపన చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఈ ముఠా భారీ స్కెచ్ తో నే ముందుకు సాగుతోందని తెలుస్తోంది.
- Tags
- DRP
- Karimnagar






