- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పటి మాయ లేడీ.. ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమన్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. సుశాంత్ సూసైడ్ వెనుక ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రియా నటించిన ‘చెహ్రే’ మూవీ రిలీజ్ కూడా పాండమిక్ కారణంగా పలుమార్లు వాయిదాపడింది. కాగా మూవీ రిలీజ్‌పై రియా ఇన్సిడెంట్ ఎఫెక్ట్ చూపించిందా? అన్న ప్రశ్నకు డైరెక్టర్ రూమీ జాఫ్రీ.. తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. రియా పర్సనల్ లైఫ్ […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. సుశాంత్ సూసైడ్ వెనుక ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రియా నటించిన ‘చెహ్రే’ మూవీ రిలీజ్ కూడా పాండమిక్ కారణంగా పలుమార్లు వాయిదాపడింది. కాగా మూవీ రిలీజ్‌పై రియా ఇన్సిడెంట్ ఎఫెక్ట్ చూపించిందా? అన్న ప్రశ్నకు డైరెక్టర్ రూమీ జాఫ్రీ.. తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. రియా పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీ సినిమాపై ప్రభావం చూపలేదని తేల్చేశాడు. అయితే గతేడాది రిలీజ్ చేస్తే ప్రభావం ఉండేదన్న విషయాన్ని ఒప్పుకుంటానన్న రూమి.. ఆ టైమ్‌లో రియా పట్ల మీడియా ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నాడు.
ఆమెను మంత్రగత్తె, మాయలేడీ అంటూ రకరకాలుగా అభివర్ణించారని, కానీ ఈ ఏడాది తను మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా ప్రకటించబడిందని అన్నారు. అంటే ప్రజల దృష్టికోణంలో మార్పు వచ్చిందని, అందుకనే రియా ఎఫెక్ట్ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదని తెలిపారు. కాగా అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి తదితరులు నటించిన ‘చెహ్రే’ మూవీ ఆగస్టు 27న రిలీజ్ కానుంది.
- Tags
- Chehre






