- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియా చక్రవర్తి మిస్సింగ్.. నిజమేనా?
<p>దిశ, సినిమా : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యంగ్ హీరో ఇమ్రాన్ హష్మి నటించిన ‘చెహ్రే’ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతున్న విషయం తెలిసిందే. 2020 జులైలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా వేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవలే విడదల చేయగా, అందులో హీరోయిన్ రియా చక్రవర్తి ఫొటో లేకపోవడం గమనార్హం. అయితే అమితాబ్, ఇమ్రాన్ హష్మితో సహా […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యంగ్ హీరో ఇమ్రాన్ హష్మి నటించిన ‘చెహ్రే’ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతున్న విషయం తెలిసిందే. 2020 జులైలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా వేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవలే విడదల చేయగా, అందులో హీరోయిన్ రియా చక్రవర్తి ఫొటో లేకపోవడం గమనార్హం. అయితే అమితాబ్, ఇమ్రాన్ హష్మితో సహా చిత్రబృందం ఎవరూ కూడా ‘అఫిషియల్ అనౌన్స్‌మెంట్’ విషయంలో ఆమెకు ట్యాగ్ చేయలేదు. అయితే తాజాగా చెహ్రే టీమ్ నుంచి మరో పోస్టర్‌తో పాటు శివరాత్రి సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పోస్టర్‌లోనూ రియా లేకపోవడం, పైగా చిత్రయూనిట్ పేర్లలో గానీ, ట్వీట్లలో గానీ ఆమె పేరు మెన్షన్ చేయకపోవడం మరోసారి నెట్టింట్లో చర్చకు దారితీసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా.. అరెస్టయి కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించిన విషయం తెలిసిందే. కాగా బెయిల్‌పై బయటకొచ్చిన ప్రస్తుతం తన పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తిచేసే పనిలో పడింది. ఇక సుశాంత్ మరణం తర్వాత విడుదలైన చిత్రాల్లో పలువురు బాలీవుడ్ వారసులు నటించటం వల్ల నెపోటిజం సెగ తగిలి ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేక పోయాయి. అదే భయంలో ‘చెహ్రే’ దర్శకనిర్మాతలు సుశాంత్ కేసులో నిందితురాలైన రియాను, సినిమా అధికారిక ప్రకటనలు, పోస్టర్‌ల నుంచి తప్పించి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే మేకర్స్ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
T 3837 – Chand Chehre, hazaaron raaz. Har chehra kuch kehta hai aur bohot kuch chupata hai. Uncover their real #Chehre in cinemas on 30th April 2021 #ChehreTeaser 11th Mar #FaceTheGame@emraanhashmi @anandpandit63 @rumyjafry @krystledsouza @SiddhanthKapoor @annukapoor_ #Raghubir pic.twitter.com/rM8FBQDbPp
— Amitabh Bachchan (@SrBachchan) March 9, 2021
చెహ్రేకు రూమి జాఫ్రీ దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్రాన్ హష్మి, అమితాబ్, అనూ కపూర్, కృతి కర్బందా, సిద్ధాంత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ & సరస్వతి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక గతేడాది మార్చి 27 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియా చక్రవర్తి.. మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ‘నా ధైర్యం, నా గమ్యం, నా శక్తి మా అమ్మే’ అని పోస్ట్ చేసింది. కాగా రియా కమ్ బ్యాక్‌తో ఆమె ఫాలోవర్స్.. ‘రియా ధైర్యాన్ని కోల్పోకు, మళ్లీ ఇన్నాళ్లకు నువ్వు సోషల్ మీడియాలోకి రావడం సంతోషంగా ఉంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.






