ఇరకాటంలో పడ్డ సెన్సేషనల్ డైరెక్టర్ RGV

by  |
RGV
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాంగోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన పెట్టే ట్వీట్ల కోసం విమర్శకులతో పాటు, ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తరచూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఇతరులను ఇరకాటంలో పెట్టే వర్మ ఇప్పుడు తాను పెట్టిన ట్వీట్ తోనే ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పార్క్ అనే సంస్థ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో 9000 షార్ట్ ఫిల్మ్స్ పోటీలో పాల్గొన్నాయి. అయితే వీటిలో 18 షార్ట్ ఫిల్మ్స్ ని విజేతలుగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించి జూలై4 వ తేదీన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. అయితే ఆర్జీవీ మాత్రం జూలై 4కు బదులు జూన్ 4 వ తేదీ అని ట్వీట్ చేశారు. ఇదే ఛాన్స్ అని భావించిన విమర్శకులు ఆ ట్వీట్ ను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. వర్మ ఇన్ని రోజులకు దొరికాడని తెగ ఆడేసుకుంటున్నారు.

RGV


Next Story

Most Viewed