కంగనను చూసి స్వర్గంలో జయలలిత థ్రిల్ అవుతుంది : ఆర్జీవీ

by  |
RGV Tweet On ThalaiviTrailer
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బర్త్ డే సందర్భంగా మంగళవారం విడుదలైన ‘తలైవి’ ట్రైలర్‌ అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటోంది. కంగనకు శత్రువులుగా పరిగణించబడేవారు సైతం తన పర్‌ఫార్మెన్స్ చూసి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ కంగనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ‘ కంగన నీతో చాలా విషయాల్లో విభేదించవచ్చు. కానీ ‘తలైవి’‌లో సూపర్ డూపర్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన నీకు సెల్యూట్ చేయాలనుకుంటున్నా. ‘తలైవి’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్. స్వర్గంలో ఉన్న జయలలిత తప్పకుండా థ్రిల్ అవుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన కంగన.. ‘సార్.. నేను మీతో ఏ విషయంలోనూ విభేదించను.. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను మరియు అభినందిస్తున్నాను. ఇలాంటి డెడ్ సీరియస్ వరల్డ్‌లో చాలా ఈజీగా ఈగోతో హర్ట్ అవుతుంటారు.. కానీ మీరు అలా కాదు.. ఏ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా చాలా కూల్‌గా ఉంటారు. థాంక్యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్’ అని రిప్లై ఇచ్చింది.

Next Story

Most Viewed