RGV :మోడీ జీ.. ఆస్కార్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారుగా..

by  |
RGV, Modi
X

దిశ, సినిమా: పీఎం మోడీపై ఆర్జీవీ మరోసారి సెటైర్ వేశాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిలైన ప్రధానమంత్రి గురించి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్న వర్మ.. తాజాగా మళ్లీ విరుచుకుపడ్డాడు. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన మోడీ భారత్‌లో కొవిడ్ మరణాలు చూసి తట్టుకోలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. కొవిడ్ మృతులకు నివాళులు అర్పించిన మోడీ.. ఎమోషనల్ కావడం ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది. ఈ క్రమంలో మోడీ ఏడుపును డ్రామాగా వర్ణిస్తూ కామెంట్ చేశాడు వర్మ. ఆస్కార్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావ్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ఈ ఎడిటెడ్ వీడియోలో బెస్ట్ యాక్టర్‌గా మోడీ ఆస్కార్ అందుకోగా.. ఆర్నబ్ గోస్వామితో పాటుగా ప్రముఖ మీడియా ప్రతినిధులు చప్పట్లు కొడుతూ ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/RGVzoomin/status/1396003387536146436

Next Story

Most Viewed