మీ క్రియేటివిటీకి కుదోస్.. సబ్ లైమ్ డాన్స్ గ్రూప్ కు ఆర్జీవీ ప్రశంస

by  |
మీ క్రియేటివిటీకి కుదోస్.. సబ్ లైమ్ డాన్స్ గ్రూప్ కు ఆర్జీవీ ప్రశంస
X

రామ్ గోపాల్ వర్మ గ్రేట్ డైరెక్టర్… తనకు నచ్చితే కాంప్లిమెంట్స్… లేదంటే కామెంట్స్. కానీ ఆయన నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే వారిలో సంథింగ్ స్పెషల్ ఉందన్న మాటే. క్రియేటివిటీ కొందరిలో ఉంటుంది…క్రియేటివిటీని గుర్తించి ప్రోత్సహించడం నాలో ఉంది… తరువాత మీ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడం చేసుకోకపోవడం మీలో ఉంటదని చెప్పే ఆర్జీవీ… యూట్యూబ్ లో ఓ క్రియేటివ్ వీడియో చూసి మీ సృజనాత్మకకు ఖుదోస్ మిమ్మల్ని కలవాలి అంటూ ట్వీట్ చేశారు.

చౌరస్తా బ్యాండ్ కంపోజ్ చేసిన చేయి చేయి కలపకురా… చేతులెత్తి మొక్కుతా పాటపై కవర్ సాంగ్ చేసిన టీమ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. సబ్ లైమ్ డాన్స్ స్టూడియో కంపోజ్ చేసిన ఈ పాటతో .. లాక్ డౌన్ వల్ల సృజనాత్మకత ఆగిపోదని నిరూపించారని ప్రశంసించారు. జీరో బడ్జెట్ లో మీ ఇంట్లోనే చేసిన ఈ వీడియో ప్రొడక్షన్ వాల్యూ, ఎంటర్టైన్మెంట్ … భారీ బడ్జెట్ సినిమాల్లోనూ లేదని కాంప్లిమెంట్ ఇచ్చారు ఆర్జీవీ. మరిన్ని వీడియోల కోసం ఎదురుచూస్తున్నాను అని… ఈ పాట కొరియోగ్రఫీ చేసిన శ్రీరాజ్ నిలేష్, ధన్ రాజ్ మోపౌర్ లతో త్వరలో కలిసి పని చేస్తానని తెలిపారు.

Tags : RGV, Ramgopal Varma, Creativity, Sablime Dance Group, YouTube


Next Story

Most Viewed