అప్సరా రాణితో ఆర్జీవీ రొమాన్సింగ్.. సూర్యుడి కంటే హాట్‌గా ఉన్నావంటూ.. 

by  |
apsara rani
X

దిశ, సినిమా : గంటకో అమ్మాయిని లవ్ చేస్తే బెటర్ అని చెప్పే ఆర్జీవీ.. ప్రస్తుతం అప్సరా రాణితో ప్రేమలో పడ్డాడేమో అంటున్నారు నెటిజన్లు. ట్విట్టర్‌లో ఆమె పోస్టులపై ఆయన రొమాంటిక్‌గా స్పందించడమే ఇందుకు కారణం. కాగా ‘ఫారెస్ట్ బాత్’ అంటూ అప్సర పెట్టిన వీడియోపై స్పందించిన వర్మ.. బికినీలో స్విమింగ్ ఎంజాయ్ చేస్తున్న తను సూర్యుడి కంటే హాట్‌గా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

పనిలో పనిగా ఇంతకీ ‘ఫారెస్ట్ బాత్’ ఎక్కడా? అని ప్రశ్నించడంతో వెంటనే సమాధానమిచ్చింది అప్సర. తనకు కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు వర్మకు థాంక్స్ చెప్తూనే.. ప్రకృతితో పూర్తిగా మమేకమై ఎంజాయ్ చేస్తున్నప్పుడు ‘ఫారెస్ట్ బాత్’ వర్డ్‌ను ఉపయోగిస్తారు’ అని తెలిపింది. ఇక అప్సర రిప్లయ్‌కు బదులిచ్చిన వర్మ ‘ఓహ్ నిజమా.. కానీ ప్రకృతి నీలో మమేకమైంది అనుకున్నానే’ అంటూ కొంటెగా కామెంట్ చేశాడు. దీంతో ‘ఆర్జీవీ రొమాన్సింగ్.. ఫ్లర్టింగ్ కింగ్ మా వర్మ’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

https://twitter.com/RGVzoomin/status/1468483987316228099?s=20

Next Story