- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేట్ పెంచేసిన ఆర్జీవీ.. కారణం?
<p>ఆర్జీవీ ఓన్ థియేటర్‌ను సృష్టించాడు. ‘కరోనా నన్నేం చేస్తుంది..? మహా అయితే థియేటర్లను మూసేయిస్తుందేమో కానీ.. నా ఆలోచనను కాదు’ అంటూ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఏకంగా తన సొంత ఆన్‌లైన్ థియేటర్‌ను ప్రారంభించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు వర్మ. అందరూ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ అని ఓటీటీల వైపు పరుగులు పెడుతున్న తరుణంలో.. తను మాత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ను సృష్టించాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ‘క్లైమాక్స్’ […]</p>

ఆర్జీవీ ఓన్ థియేటర్‌ను సృష్టించాడు. ‘కరోనా నన్నేం చేస్తుంది..? మహా అయితే థియేటర్లను మూసేయిస్తుందేమో కానీ.. నా ఆలోచనను కాదు’ అంటూ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఏకంగా తన సొంత ఆన్‌లైన్ థియేటర్‌ను ప్రారంభించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు వర్మ. అందరూ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ అని ఓటీటీల వైపు పరుగులు పెడుతున్న తరుణంలో.. తను మాత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ను సృష్టించాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ‘క్లైమాక్స్’ తీసిన ఆర్జీవీ.. తన ఓన్ ఆన్‌లైన్ థియేటర్‌లో సినిమా రిలీజ్ చేసి, క్లైమాక్స్ చూడాలనుకున్న ఒక్కో ప్రేక్షకుడి నుంచి వంద రూపాయలు వసూల్ చేశాడు. దాదాపు 50 వేల మంది సినిమా చూస్తారని ఎక్స్‌పెక్ట్ చేసిన ఆర్జీవీ క్లైమాక్స్‌కు.. సర్వర్ క్రాష్ అయ్యేంత రెస్పాన్స్ వచ్చింది. కేవలం 12 గంటల్లోనే 1,68,596 మంది ప్రేక్షకులు సినిమా చూసి ఇది ఆర్జీవీ బ్రాండ్ అని నిరూపించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ‘నగ్నం’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతానని చెబుతున్నాడు వర్మ. మంగళవారం ‘నగ్నం’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ.. ఈ చిత్రానికి ఒక్కొక్కరి నుంచి రూ. 200 రూపాయలు వసూల్ చేస్తాడట. క్లైమాక్స్‌కు రూ.100 రూపాయల టికెట్‌తో సినిమా చూపించిన వర్మ.. అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో టికెట్ రేట్ డబుల్ చేశాడు. ఇంతకీ దీనికి ఆర్జీవీ చెప్తున్న కారణం ఏంటో తెలుసా..? భారతీయ మహిళలను విదేశీ మహిళల కంటే రెట్టింపు విలువైనవారిగా భావిస్తారట. ఈ విషయంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు నెటిజన్లు. మీరు నిజంగా బెస్ట్ బిజినెస్‌మన్ ఆర్జీవీ గారు.. ఎంతైనా ప్రొడక్ట్ సేల్ చేయడంలో మీకు మీరే సాటి అంటున్నారు.
Reason for putting NAKED #NNN Rs 200 per view a 100 rupees more than for CLIMAX Rs 100 per view is because I value Indian women double more than foreign women https://t.co/BJMbbSHl81
— Ram Gopal Varma (@RGVzoomin) June 9, 2020






