ఆర్జీవీ మిస్సింగ్ ?

by  |
ఆర్జీవీ మిస్సింగ్ ?
X

పవర్ స్టార్ సినిమాతో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఈ సారి తన కథతోనే ఇండస్ట్రీతో పాటు పాలిటిక్స్‌లో చిచ్చు రేపేలా ఉన్నాడు. ఎవరైనా కల్పిత కథల ఆధారంగా సినిమా తీస్తారు లేదా యదార్థ గాథల ఆధారంగా సినిమా తీస్తారు. కానీ నేను ఇప్పుడో కొత్త కొత్త జోనర్‌లో సినిమా తీయబోతున్నాని ప్రకటించారు. అదే ఫిక్షనల్ రియాలిటీ.. అంటే కల్పిత కథలో రియల్ పీపుల్, రియల్ సిట్యుయేషన్స్ ఆధారంగా పాత్రలను చిత్రీకరించడం అని వివరించాడు ఆర్జీవీ.

ఇంతకీ తన ఫిక్షనల్ రియాలిటీ జోనర్‌లో తొలి సినిమా ఏంటంటే ఆర్జీవీ మిస్సింగ్. కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు.

ఆర్జీవీ మిస్సింగ్ కేసు నిందితులు:

1. పవర్ స్టార్ అభిమానులు
2. ముంబై అండర్ వరల్డ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ
3. ఫ్యాక్షనిస్టుల సహాయంతో ఆర్జీవీని చంపాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి, అతని కొడుకు

ఆర్జీవీ మిస్సింగ్ సినిమాలో క్యారెక్టర్ల గురించి పరిచయం చేస్తూ.. ప్రాన్ కళ్యాణ్ ( పవన్ కళ్యాణ్), ఒమేగా స్టార్( మెగాస్టార్), సి బెన్( చంద్రబాబు నాయుడు), లాకేష్ ( నారా లోకేష్), వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్ పేర్లు అర్థమయ్యే విధంగానే.. అర్థం కాదన్నట్లుగా మెన్షన్ చేశాడు ఆర్జీవీ. వీరితో పాటు పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్ట్‌లు ఉంటారని చెప్పాడు.



Next Story