ఆర్జీవీ టార్గెట్ పవర్ స్టార్?

by  |
ఆర్జీవీ టార్గెట్ పవర్ స్టార్?
X

ఆర్జీవీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ లేక సతమతం అవుతుంటే.. వర్మ మాత్రం సినిమా మీద సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సృష్టించి, ‘క్లైమాక్స్’ సినిమా రిలీజ్ చేసిన వర్మ.. ఒక్కో టికెట్‌కు రూ. 100 వసూల్ చేసి భారీ లాభాలే అందుకున్నాడు. ఆ తర్వాత ‘నగ్నం’ సినిమాను రిలీజ్ చేసి టికెట్ ధర రూ. 200కు పెంచిన వర్మ.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు.

ఈ మధ్య ఏపీ ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పిన వర్మ.. ఏకంగా తన మీదే ‘పవర్‌స్టార్’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. పీకే (పవన్ కళ్యాణ్), ఎన్‌బీ (నాగబాబు), ఎమ్మెస్( మెగాస్టార్), టీఎస్( త్రివిక్రమ్ శ్రీనివాస్)తో పాటు రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది గాడిదలు, ఆర్జీవీ నటిస్తాడని ప్రకటించాడు. ‘ఒకవేళ తను చెప్పిన క్యారెక్టర్స్ అర్థం చేసుకున్నా ప్రైజ్ ఇవ్వబడదు’ అని చెప్పాడు.

పవర్‌స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించే స్టార్‌ను కూడా పరిచయం చేసిన వర్మ.. తను ఆఫీస్‌కు వచ్చినప్పుడు తీసిన షాట్ అని చెప్పాడు. ఇంతకీ పవర్‌స్టార్ సినిమాలో పవన్‌ను ఎలా చూపించబోతున్నాడు..? పాజిటివ్‌గానా లేదా నెగెటివ్‌గానా అనే సందేహంతో కొందరుంటే.. ఈ సారి పక్కా పవన్‌ను టార్గెట్ చేసి పరువుతీద్దామనే ఆర్జీవీ నిర్ణయించుకున్నాడు అంటున్నారు మరికొందరు.


Next Story

Most Viewed