ఆర్జీవీ ‘డేంజరస్’ ఫస్ట్‌లుక్ ఔట్

by  |
ఆర్జీవీ ‘డేంజరస్’ ఫస్ట్‌లుక్ ఔట్
X

లాక్‌డౌన్‌లో వరుస సినిమాలు చేస్తున్న రామ్‌గోపాల్ వర్మ.. లేటెస్ట్‌గా మరో సినిమా అనౌన్స్ చేశాడు. భారతదేశంలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఈ సినిమాకు ‘డేంజరస్’ టైటిల్‌ను ఖరారు చేశాడు. ఇద్దరి మధ్య ఎఫైర్ ఎంతో మందిని చంపిందని వీరిలో గ్యాంగ్‌స్టర్స్, పోలీసులు కూడా ఉన్నారనేది క్యాప్షన్.

అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో.. ఇద్దరు మహిళల మధ్య ఉన్న ఉద్వేగభరితమైన, తీవ్రమైన ప్రేమే ఈ చిత్ర కథ అని తెలిపాడు వర్మ. వీరి ప్రేమ చంపడానికైనా సిద్ధమే.. చావడానికైనా సిద్ధమే అనేలా ఉంటుందని, ఎపిక్ ఎమోషనల్ లవ్ స్టోరీగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పాడు. అప్సర, నైనా ఇండియన్ సినిమాల్లో కొత్త యుగానికి మార్గదర్శకం చేశారని అభినందించాడు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు సెక్షన్ 377ను రద్దు చేసిన తర్వాత వస్తున్న ఈ చిత్రం.. భారత సాంస్కృతిక సంప్రదాయాల కళంకాన్ని తొలగించేలా ఉండబోతుందన్నాడు.

కాగా, డేంజరస్ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా.. అప్సర రాణి, నైనా గంగూలీ పోస్టర్స్‌పై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. డేంజరస్ ఆర్జీవీ హాష్ ట్యాగ్‌తో సినిమా ఫస్ట్‌లుక్ ట్రెండ్ అవుతుండగా.. నిజంగానే ఆర్జీవీ డేంజరస్ అంటున్నారు నెటిజన్లు.


Next Story

Most Viewed