రైతు వేదికల నిర్మాణాలపై సమీక్ష

12

దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న రైతు వేదికల నిర్మాణాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటి రైతు వేదిక శంకుస్థాపన పటాన్‌చెరు నియోజకవర్గంలోనే చేయడం జరిగిందన్నారు. దీనికి అనుగుణంగా ఇక్కడే తొలి రైతు వేదిక ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది రైతు వేదికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని రైతు వేదికలు నిర్మాణాలు పూర్తయ్యాయని, దసరాలోపు వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పుల్లో రైతు వేదికలు ఒక భాగమని ఆయన అన్నారు.