Casting couch. 14 మంది పేర్లు బయటపెట్టిన నటి

by  |
Revathy-Sampath
X
దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌తో (Casting couch)ఫిమేల్ యాక్టర్స్ ఎంతగా బాధపడుతుంటారో అందరికీ తెలుసు. చాన్స్ కావాలా.. అయితే నాతో రాత్రంతా గడుపు.. అనే షరతుతోనే అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అగ్రిమెంట్‌ను కొందరు అంగీకరిస్తే.. మరికొందరు మొహం మీదనే తిట్టి మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన ‘మీటూ’ ఉద్యమం పలువురు తప్పుడు సెలబ్రిటీలను నిద్రపోనివ్వకుండా చేసింది. కాగా తాజాగా మలయాళ నటి రేవతి సంపత్ (Revathy sampath) ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తనను వేధించిన 14 మంది పేర్లను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. డైరెక్టర్ రాజేశ్ టచ్‌రివర్, నటులు సిద్ధిక్, సిజ్జు‌తో సహా కాస్టింగ్ డైరెక్టర్స్, యాడ్ డైరెక్టర్స్, పోలీసులు, డాక్టర్లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇక సినిమాల్లో పనిచేసే మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పోరాటంలో తాను వెనుకడుగు వేయబోనని చెబుతూ.. ఇలాంటి మోసగాళ్ల గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని ఫేస్‌బుక్‌లో నేమ్స్ రివీల్ చేసింది రేవతి.

Next Story

Most Viewed