వద్దు ఆగు… నేను చూసుకుంటా: రేవంత్ రెడ్డి

370

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​పార్టీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఎంపీ రేవంత్​రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్‌తో సంప్రదింపులు చేయగా… రాజీనామా చేసిన హర్షవర్ధన్​రెడ్డితో తాజాగా సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. హర్షవర్ధన్‌ను పిలిపించుకుని సమావేశమయ్యారు. హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్​విషయంలో హర్షవర్ధన్​ అలక బూనిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పార్టీకి రాజీనామా లేఖ పంపారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ రేవంత్​ వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ నుంచి కాకుండా… స్వంతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు హర్షవర్ధన్​రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. దీంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని రేవంత్​రెడ్డి బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం తొందరపడవద్దని, పార్టీలో మంచి అవకాశం ఉంటుందంటూ సూచిస్తున్నారు. పార్టీని వీడవద్దని, స్వతంత్రంగా బరిలో ఉండరాదంటూ… నేనున్నా… చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..