దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు : రేవంత్ రెడ్డి

by  |
revanth-reddy
X

దిశ, ఉప్పల్ ; నిరుపేద ప్రజలపై పెత్తనం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఉప్పల్ బస్ డిపోవద్ధ నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో పాల్గొన్నారు. భరోసా కల్పించేందుకే పతిపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయనీ, ఇది పార్టీలకు సంబంధించిన సమస్య కాదనీ ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకోచ్చి , అదానీ, అంబానీలకు తాకట్టుపేట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేసిందనీ విమర్శించారు. వ్యవసాయ నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు 300 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ 19 ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిస్తే రైతులకు మద్దతు తెలుపాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంద్ లో పాల్గొనకుండా మోదీ విందులో చేరారని ఘాటుగా విమర్శించారు.

కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే కాపాడాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం ముసుగులో కోట్ల రూపాయల వ్యాపారాలు చేసినా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్ నుంచి బయలు దేరిన నలుగురు వ్యక్తులు 130 కోట్ల ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజా రవాణా వ్యవస్తను తాకట్టు పేట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులకు మద్ధతు ధర కల్పించే విధంగా, వినియోగదారులకు అండగా గత కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదో ప్రజలు గమనించాలన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్న లక్ష 91 వేల 638 ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో లక్ష 7 వేల ఖాళీలను భర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ గడిచిన ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇంటికో ఉద్యో్గం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు కట్టబెట్టిన విషయాన్ని నిరుద్యోగులు, ప్రజలు గుర్తించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో పేదల బతుకులు దుర్భరంగా మారాయని ఆరోపించారు. నల్లచట్టాలు రైతులుకు , వినియోగదారులకు మరణశాసనాలేనని భవిష్యత్ లో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించి , వ్యాక్సిపై తన బొమ్మ వేసుకోవటంపై మడ్డిపడ్డారు.

శ్మశానాల వద్ధ మోదీ ఫోటోలు పెట్టుకోవాలని, మరో వైపు రాష్ట్రాన్ని తాగుబోతులుగా మార్చిన కేసీఆర్ ఫోటోను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రతి బార్ , మద్యం దుకాణాల వద్ద పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ప్రకటన రావాలంటే కేసీఆర్ చిత్రపటానికి క్వాటర్, ఆఫ్ బాటళ్లతో మందు పోయాలనీ, కోరియర్లు, స్విగ్గీల ద్వార ప్రగతి భవన్ కు మందు సీసాలు పంపి నిరసన చేస్తే నైనా నోటిఫికేషన్ల జారీ వస్తుందోనని ఎద్ధేవా చేశారు. అనంతరం వరంగల్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంను పోలీసులు అరెస్టు చేశారు. భారత్ బంద్ కారణంగా వరంగల్ జాతీయ రహాదారి స్తంభించింది. ఎక్కడి వాహానాలు అక్కడే నిలిచిపోవటంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపిపోయింది. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అజీజ్ షాషా, అఖిల పక్షం నాయకులు బాలమల్లేష్, రాజేష్, చంద్రశేఖర్, విమలక్క, సంద్యా, కాంగ్రెస్ జిల్లా నాయకులు నందికంటి శ్రీదర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story