- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ టెస్టు చేసుకుందాం.. ఎల్లుండి ఏ హాస్పిటల్ పోదాం కేటీఆర్: రేవంత్
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ డ్రగ్స్ వాడేవారికి బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ టెస్టులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి గ్రీన్ చాలెంజ్ మాదిరిగా కేటీఆర్, కొండా విశ్వేశ్వర రెడ్డికి వైట్ చాలెంజ్ విసురుతున్నట్టు ప్రకటించారు. డ్రగ్స్ వినియోగించలేదని చెప్పారు కదా.. ప్రజలకు ఆదర్శంగా ఉందాం.. టెస్టుకు రండి కలిసి చేయించుకుందాం అని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ డ్రగ్స్ వాడేవారికి బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ టెస్టులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి గ్రీన్ చాలెంజ్ మాదిరిగా కేటీఆర్, కొండా విశ్వేశ్వర రెడ్డికి వైట్ చాలెంజ్ విసురుతున్నట్టు ప్రకటించారు. డ్రగ్స్ వినియోగించలేదని చెప్పారు కదా.. ప్రజలకు ఆదర్శంగా ఉందాం.. టెస్టుకు రండి కలిసి చేయించుకుందాం అని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు వస్తానని, మీరు ఏ హాస్పిటల్‌కు రమ్మంటే అక్కడికి వస్తానని తేల్చిచెప్పారు. యువ తరాన్ని డ్రగ్స్ నుంచి కాపాడే బాధ్యత మనపై ఉందన్నారు. డ్రగ్స్ విచారణను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story






